ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువదియన ప్రకరణము

299



లయిన అలంకారములం ధరించియుండెను. అతఁడా విగ్రహ మునుకండ్లారఁ జూచెను. కాని యతని హృదయమత్యంత దుర్బల స్థితిలో నుండెను. అతఁ డెవఁడో తెలిసికొన వలయునని యతని హృదయము వేధించుచుండెను. తన కొఱకై ప్రాణ మర్పిం చిన యా" పురుషునకుఁ దానేమి ప్రత్యుపకారము చేయగలనా యని అతడు యోజింపసాగెను. అతనికి బాధ అంత కంతకు హెచ్చుచుండెను. ఇంతలో నా శరచ్చంద్ర నిభమగు నావన మొక్కపరి కండ్లు తెరచెను. ఆ చూపు పీయూషమును వర్షించుచుండెను. తెల్ల గల్వ రేకులను జిమ్ముచుండెను. శాంత రసము నోల్కుచుండెను. ఆ విగ్రహము తెప్పవాల్చక విజయ సింహునిపంకఁ జాల కాలము చూచెను.విజయసింహుని. చూపు లాచూపులలో గలసెను. అవి సమ్మేళనమై పోయెను. ఆచూపు లితనిం గట్టిగా బంధించు చుండెను. అతని కేమియు స్ఫురింపలేదు.


ఆ విగ్రహ మంకను జూచు చుండెను. ఆమె కండ్ల నీరు తిరిగెను. అద దార పారెను. ఆ ధారలు క్రిందికిఁ బ్రవహించి ఆమె చెవులును నింపుచుండెను. విజయ సింహుఁడు మెల్లగా “మీరెవరు?" అని ప్రశ్నించెను. కాని మాట్లాడు శక్తి యామెకు లేదు.

ఆమె యొక సంజ్ఞ చేసెను. అతఁడది గ్రహించెను. “అతని యంగము కంపించెను. పులకాంకిత మాయెను.