ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

విజయనగర సామ్రాజ్యము


స్వర్ణ కుమారి రాధాకుమారుని యుద్ధమునుండి కొంపోయి యొక శిబిరమునం జేర్చెను. అందు దెబ్బతిని పడియున్న జగన్మో హినీ విజయ సింహులుండిరి. ఆమె పోవునప్పటికి వారికి స్మృతి తెలియ లేదు. వారి నట్టి స్థితిలో కంగొను సరికామె గుండెలు పగిలెను. నీరయిపోయెను. ఆమేకుఁ బైప్రాణము పైసనే లేచి పోయెను. ఆమె శరీరము నందలి గాయము లెల్ల నా యుద్రేక స్థితిచేఁ బొంగి రక్తముం జిమ్మెను. కొంచెము సేపు పిచ్చి గొణుగుఁడు గొణిగెను. అందర్థము లేదు. క్రమముగా శీతల మెక్కెను. రాధాకుమారుని పైనం బడి గతించెను. రాధాకుమారుఁడు కొంచెము సేపటికిఁ గన్నెత్తి చూ చెను. అతఁడు స్వర్ణ కుమారం జూచియుండెను. జగన్మోహినీ విజయసింహులంగూడఁ జూచియుండ వచ్చును. కొంచెము సేపువఱకు నేమో యోచించెను. అతనికి మాట లేదు. పలుకు లేదు. కన్ను లనుండి వెచ్చని బాష్పములు ప్రవహించెను. కండ్లు మూతలు వడియెను. మరల మఱియొక సారి కన్నెత్త లేదు.


జగన్మోహిని యింక ను ప్రపంచ మెఱుంగకుండెను. విజయసింహుఁడు కొంత సేపయిన తరువాత కన్ను దెరచెను. ఎట్టయెదుట దివ్యసుందర విగ్రహము తనను రక్షించిన యూ రాజపురుష విగ్రహముండెను. ఆ విగ్రహము తేజో వంతము