ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న లు వ ది య వ ప్రకరణ ము

తరువాత

మన సంపదలు శాశ్వతములు కావు. మస విభవముఖు శాశ్వతములు కావు. ప్రపంచము నుందలి దృశ్యపదార్థము లెల్లఁ బరిణామాంతరముల నందుచుండును. మనోహరములై , శీతల ములై , సరసజన హృదయ రంజుముని శరత్కాల చంద్రి కలు నిల్వవు. యౌవసము వృద్ధత్వము వలనం బరాజయము నందును. దివ్య భవసములు సౌధములు దివ్యనగరములు-- ప్రపంచమందలి సమస్త దివ్యసువులు నశించినవి. నశించు చున్నవి. నశింపనున్నవి. భాషలు నశించినది. మార్పుం జెంది నవి. చెందుచున్నవి. కాని మనహ్రస్వదృష్టిని యెల్లను గోచరింపవు. మనకందలకు నొక పరిణమ కాలము కలదు. నీవు శాశ్వతము కాదు. 'నేను శాశ్వతము కాదు. ఎవరును శాశ్వతము కాదు.


మధ్యాహ్నము గతించెను. సూర్యుడపుడు పూర్వము వలె తీక్షముగా లేఁడు. ఆకసము నిర్మలముగా నుండెను. దినము పరిణామ మందుచుండెను. చేయాడ కున్నది. నోరాడ కున్నది. కనుల నుండి .... వచ్చుచున్నవి.