ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితొమ్మిదవ ప్రకరణము


గూడఁ దెగనఱికెను. కాని యిఁకఁ దానెట్లను జీవింపనని యెఱిఁగి తురకల చేతఁ జావనిచ్చగింపక ఖడ్గముతోఁ బొడిచికొని చచ్చెను.


రాధాకుమారుఁడు కూడ దెబ్బలుతిని పడిపోయెను. అతని నాళ్ళనుండి రక్తము ప్రవాహ రూపమునంబోవుటచే నతనికి నీరసము హెచ్చాయెను. భూమిపై స్మృతితప్పి పడి యుండెను. అస్థితిలో నతని నొక యౌవన హిందువు- డెచ్చటికో తీసికొనిపోయెను.


సేనాధిపతుల మరణముచేతను విజయసింహుఁడు కంపడ కుండుటచేతను సైస్యములు చీకాకుపడి విచ్చలవిడి సంచ రింపఁజొచ్చను. తమరాజులు గతించిన వెన్కబోరాడిన 'నేమి ప్రయోజసమని కొందరు సన్యస్త శస్త్రులైరి. మఱికొంద జుత్సాహ రహితులై పాగిపోఁదొడంగిరి. నాయకులు లేరు. రణరంగము..... యుద్ధ పిముఖత — ఇఁక తురుష్కకరవాలధార హిందూ సైనికుని కాయముల నేల 'నేలపాలు చేయదు. ?


ఒక్క నిముసములో హిందువులకు సిద్ధింపనున్న విజయము సంపూర్ణ పరాజయముగాఁ బరిణ మించినది.