ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితొమ్మిదన ప్రకరణము

291


మన మెఱిఁగియుంటిమి. ఇప్పుడు విజయమునందిన తిరుమల రాయ, రామరాజ చక్రవర్తు లిరువురు సేనలతో గూడవచ్చి వేంకటాద్రి పక్షమునం జేరిరి. తురకలును అట్లే యొక్క భాగ ముగాఁ జేరిరి. తురకలును హిందువులును గూడి యిట్లు జయకాం క్షులై ఘోరముగా, బోరాడుచుండిరి. అచ్చటి సైనికులును యోధులును ప్రపంచమును మఱచి యుండిరి. వీరులు యథే చ్ఛా విహారంబుచేయుచు శత్రువులను, అడ్డమువచ్చిన తమ వారింగూడ నటికి వై చుచుండిరి.


చక్రధర కృష్ణసర్పము రామరాజ చక్రవర్తిని మ్రింగి వేయఁ జూచుచుండెను. ఇంత వఱకును రామరాజునకా ఘోర సర్పముయొక్క -- స్థితి తెలిసినది కాదు. అందుచే నతఁడు నమ్మియే యుండెను. చక్రవర్తి మావటివాండ్రనుగా నిరువుర తురక లను చక్రధరుడు తెచ్చి యుఁంచెను. అదియతఁడు కని పెట్ట లేదు. ఇతరు లేవరును కనిపెట్టినట్లు మనకుందోఁచుట లేదు.


ఒక యోగిమాత్ర మెప్పుడును రామరాజు వెను వెంటనే వచ్చుచుండెను. అతఁడు నిముసమైన నెడబాసి యుండుట లేదు. చక్రధరుండది కనిపెట్టియుండవచ్చును. కాని కాలమే ల్లప్పుడును సరిగా నడువదు. ఆ యోగి తనలో నేమను కొనెనో కాని ముందుకు నాల్గడుగులువైచి విజయసింహుం బిల్వం బోయెను.