ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

11


గాక. నాకందులకు విచారము లేశమును లేదు. కాని, సుప్ర సిద్ధ మై, శత్రు భీకరమై, చిరకాలమునుండి వచ్చుచున్న యీవిజయనగర సామ్రాజ్యము నాకాలమున...............


అతని కన్నుల నీరు గిఱునఁ దిరిగెను. స్వరముమా రెను. క్రోధవిచారపూరితమై ముఖము ప్రకాశింపఁజ్"చ్చెను. అతఁ డింక మాటలాడ లేకపోయెను.

శ్రీధ:-అయినచో సీసలహాలను రాజుగారు పూర్వమువలె నంత హెచ్చుగాఁగైకొనుచుండుట లేదు ?

బుద్ధి:- లేదు. . శ్రీధ:-ఆదిల్ శాహా మిక్కిలి సమర్థుని వలెఁ గన్పట్టుచున్నాఁడు. చేయునది ద్రోహమైనను, దూరాలోచన, కార్య నిర్వహణ చాతుర్యము కలవాఁడు.

బుద్ధి:-అవు సతఁడట్టివాఁడే. విశాల మగు సామ్రాజ్యము గలదు గదాయని మన ప్రభువులు గర్వించుచున్నారు. కాని, క్రిందు మీఁదు లరయుట లేదు. చూడుఁడు ! ఆదిల్సాహా యొక్క కార్యనిర్వహణము. ఆచాతుర్యము ! అతఁడు గోల్కొండ నవాబుతో స్నేహము గావించినాఁడు. అంతీయ కాక చిర కాలమునుండి యాదిల్ శాహాకును, నిజామునకు, విరోధ ముగలదు. అదిపోవుటకుగాను దాను నిజాము కూతురైన చాంద్ బీబీని బెండ్లాడినాఁడు ! మఱియుఁ దన చెల్లెలిని నిజా " ము 'పెద్దకుమారుఁడగు మిరిజా కొసంగెను.