ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియైదవ ప్రకరణము

267


కొనిరి. అందుచే నిశ్చింతగా నా రాత్రియెల్ల నచ్చటంగడపి మఱునాఁడు ప్రయాణసన్నాహములు చేయవచ్చునని యూ హించుకొని యూరకుండిరి


సాయం కాలము కావచ్చుచుండెను. నవాబుల సైన్య ములలో నాల్గింట మూఁడువంతులు బయలు దేఱి యుత్తరముగా గొందఱును, వాయువ్యపుమూలగాఁ గొందఱును, ఈ శాన్యపు మూలగాఁ గొందఱును వెడలిరి. వారప్పుడుమాత్ర మేయా యుధములను గొనిపోవుచుండ లేదు. కాని వలయునాయుధము లేప్పుడు కానలసిన నప్పుడు దొరకుటకు వీలుచేయఁబడెను.వారు పోవునప్పుడు సర్వజనులును తమస్థానములం దప్పక యుద్ధమం దేయే భాగముల నెవ రెవరి యాధిపత్యములలో మెలఁగుదురో అట్లే పోవుచుండిరి. అందుచే నా సైన్యములలో నెవరున్నది యెనరు లేనిది యెవరేని క్రొత్తవారు మోసము చేయుటకు వచ్చినది సుళువుగా నెఱుఁగనచ్చును. ప్రొద్దు గ్రుంకఁగనే దీప ములు వెళ్లించి కొందఱు హస్తములలో ధరించి యితరులకు మార్గములఁ జూపించుచుండిరి. వారి ననుసరించి సర్వ సైన్య ములును సడచుచుండెను. ఆసైస్యసముద్రముల ప్రయాణ భేరు లును కలకలములును బ్రపంచమెల్ల నిండిపోయెను. క్రమక్రమ ముగాఁ బొద్దుగ్రుంకి నకొలఁది వారి చప్పుడులును తగ్గసుచుం డెను. ఎన్మిది తొమ్మిది గంటలగు సరికి వారిఁకఁ జప్పుడు చేయు టను మానిరి. నిశ్శబ్దముగా నొకరితో నొకరు మాట్లాడకుండఁ