ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ము ప్పది యొ క ట వ ప్రకరణము


రా య బార ము

విజయనగర చక్రవ యొక్క మహా సైన్య సముద్రము విజయనగరము నుండివచ్చి కృష్ణ కీవల వైపున తలికోటలో నున్న మహమ్మదీయ సైన్యముల కెదురుగా విడిసెను.

నవాబులందఱుంగలిసి రాయబారి నంపిరి.ఆ రాత్రి రామరాజ "వెంకటాయ తిరుమలరాయ చక్రధరులు నల్వురు నొక గుడారమునగూడి యిట్లా లోచింపఁ దొడంగిరి.

చక్ర:- శత్రువులు మన యోధుల శౌర్య పరాక్రమాధులం దెలిసికొని భయంపడియుందురు.

తిరు: దొంగతనముగా వచ్చి యూళ్ళను దోఁచుకొనుటకును, గ్రామములను తగులఁ బెట్టుటకును, హిందూ సాధువులం బాధించుటకును దక్క ఆ తురుష్కులెందుకు పనికివత్తురు!

వేంక: హిందూ దేశమును మోసముచేత నేకదా వారు జయిం చినది. లేకపోయిన మఱియొక విధముగా నన్యదుర్లభ పరాక్రమ నిధులయిన యార్యులు వంచింపఁబడుదురా !

రామ:- కాకయున్నచో వేయిజన్మము లెత్తినను శత్రుహరిణ హరణదక్షంబయిన పృధ్వీ రాజసింహంబును గోరీ జయింప