ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

237


చేయుచు, ఆత్మదేశ సంరక్షణమే తమ జన్మవ్రతముగా భావించి తద్రక్షణకొఱకుకు సర్వస్వమును జయించిన యో ధులు పెక్కు వేలమంది కలరు.

అహమ్మద్: మన పక్షమున నెవరి కెవరి కెన్నెన్ని సైన్యము లున్నవో యొకపరి సెలవిండు.

ఆదిల్ :- మొదట నేను జెప్పెదను. మా కాల్బలమంతయు మూఁడులక్షల పదునై దు వేలు. గుఱ్ఱములు పదునెన్మిది వేలు. సైన్యమంతయు మూఁడు భాగములుగాఁ జేసితిని. అధ్య తులు, వారి క్రింద సైన్యాధిపులు, వారి క్రింద నుప సై న్యాధి పులు, ఇట్లు విభజించితిని. ఏనుగ లేడువందలు.

బేదర్ :- గోల్కొండవారు చెప్పుండు. గోల్కొండ: అహమ్మద్ నగరు నారిది కానిండు.

అహమ్మద్:- మీరు చెప్పుండు.

గోల్కొండ: కాల్బలము మూఁడులతులు. గుఱ్ఱము లిరువది రెండు వేలు. ఏనుగ లాఱువందలు.

అహమ్మద్:-మా కాల్బలము మూఁడులక్షలు. గుఱ్ఱములు ముప్పది వేలు. ఏనుగ లేడువందల యేబది.

బేదర్ :- మా కాల్బలము రెండులక్షల యిరువదియైదు వేలు. గుఱ్ఱము లిరువది వేలు. ఏనుగులు మూఁడువందల యేబది. మా గుఱ్ఱములు శ్రేష్ఠములైనవికావు.