ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము


గోల్కొండ:-మంచి సంగతి. అది అడుగవలసిన దే.

బేదర్ : ఏనుగులుకూడ నయిదువందలు కోరుదము.

అహమ్మద్ : మఱియొక యంశముకూడ నున్నది. మన రాయబారులకు సరియైన గౌరవము చేయుట. ఇదివజుకు వారు రామ రాజుముం దాయన యిష్టము లేకుండ గుఱ్ఱముల పైన నెక్కఁగూడదని యనుమతిం జేసినాఁడట! దాని నిపుడు కొట్టి వేయుటకుఁ గోర వలయును. మఱియు నతని సభా మండపమున మన తురక రాయ బారులను నిల్వఁబడు నట్లతఁడు చేయకుండుటకును, అతని రాయ బారులను మనము గౌరవించునట్లు వారిని గౌరవించుటకును, తగు నాసనము నొసంగుటకును మన మిందు షరతు నుంచ. వలయును.

ఆదిల్ :-ఇది ముఖ్యమైన వానిలో నొకటి. మఱి ముఖ్యాంశ ములే మేనిగలవేమో ఆలోచింపుడు.

బేదర్ : మఱి ముఖ్యాంశములున్నట్లు తోఁచుట లేదు. ఇవి చాలును లెండు. నిజము సంధియైనఁ బెక్కు షరతులు గా వలయును గాని వట్టి దానికి న్నేల ! అయినను, ఇదివఱకే. కావలసిన వన్నియు వచ్చినవి.

అహమ్మద్ : స రేకాని శత్రుపక్షము వారి సైన్యమంతయు నెంత యున్నదో సరిగా నెవరైన నిపుడు చెప్పఁగలరా ?