ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము


తోనైరమును వహింపఁడనియు వాఁడుక. మఱి యితనితో నేలకలహించెనో కారణము తెలియదా ?

ఆదిల్ : అతఁడు రాజవంశములోని వాఁడు. చిన్నప్పటి నుం డియు రాజ్యాశ యతనికి విస్తారము. రామరాజు దయ చేత మన్నించి యతనికి గొప్ప యుద్యోగములన్నియు నిచ్చి క్రమముగా మొన్ననే మంత్రిపదవి నొసంగెను. రాజ్యము నెట్లేని సంపాదించుటయే కర్తవ్యమని తలంచు వాఁడగుటచేతఁ దత్కాంక్షనేఁ గల్పింప నిందు చేరినాఁడు.

బేదర్ : మీరు చేయు కార్యములు దూరదృష్టి సమన్వితములు. బలే! మంచి పని చేసినారు. మీయందు రామరాజునకు మొన్నటివఱకు విశ్వాసము మెండు.

ఆదిల్ : అవును.

అహమ్మద్ : మాయుక్తి మంచిదే. కాని సంధిషరతులు మా టే మాలోచించినారు ! మంత్రి మనవాఁడు గనుక ఇది పడవచ్చును.

బేదర్ : అతనికైన యుద్ధపుఖర్చులు మనమిచ్చునట్లు చెప్పు వలయును. లేనియెడల, అతఁడు దీని మొగము చూడనే చూడఁడు.

అహమ్మద్: యుద్ధపుఖర్చు రమారమి యతనికీ సరి కెనిమిది తొమ్మిది కోట్లై యుండవచ్చును. అంతయు నిచ్చెద మన్నచో నమ్మఁడు.