ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

విజయనగర సామ్రాజ్యము


దురు. ఇది కొంతవరబికుం బ్రయోజనకారియని తోఁచు చున్నది.


అహమ్మద్:- ఆఁ ! మంచి యుపాయము. మిక్కిలి యుక్తము గా నేయున్నది.


గోల్కొండ:. తమ యుపాయము బాగుగనే యున్నది. కాని వారుకూడ మనవలెనే తమ సై న్యమును మూఁడుగనో నాల్గుగనో చేసి మనలను వెంబడించిన !


బేదర్ :-సాహసమునను బరాక్రమమునను వారు మనలను మించినను యోచనలో మనలను మించలేరు. యోచనలు వారికిఁ దోఁచవు. పైగా వారికి పుడొక గర్వ ము కూడ గలదు. గత యుద్ధములలో నెచటను, ఎప్పుడును వారికి పరాభవము సంభవించినది కాదు. అందుచేత వారి కెన్నటికిని పరాభవము, అపజయము కలుగదని వారి నమ్మకము. ఆ యుద్దేశముచే వారిట్టియుక్తులకు దిగరు.


గోల్కొండ: నిజమే. తెల్విలో వారు మనలకు జంకుదురు. మనపాటి యోజనా సమర్థత వారికి లేదు.

అహమ్మద్:-అట్లనుచున్నా రేమి? వారికి బాపనయ్యలు లేరా ? మూఁడు లోకాలు మ్రింగి వేయుట కొక్క బ్రాహ్మణుఁడు చాలు, తదితరులలోఁగూడ వారికిందీసి పోని వారు చాల మందిగలరు. ఏది యెట్లున్నను, ఆ యుపాయము. మిక్కిలి మంచిది. మీరు చెప్పినట్లు చేసి చూచుట యుక్తమే. '