ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది య వ ప్రకరణ ము

దుష్ట గ్రహ కూ ట ము

1565–న సంనత్సరము ప్రవేశించెను. ఉత్తరమున నక్బ రుత్కృష్ట సామ్రాజ్య స్థాపనకుఁ బునాదులు వేయుచుండెను. దక్షిణ హిందూ దేశ మెల్ల విజయనగర సామ్రాజ్య చ్ఛత్రము క్రింద సౌఖ్య మనుభవించుచుండెను. మధ్యభాగమును బేదరు అహమ్మద్ నగరు గోల్కొండ బీజపూరు నవాబులు పాలించు చుండిరి. కాని దేశ మెల్ల సంక్షోభించుచుండెను. రాజపుత్రులు విజృంభించి యనన్య సామాన్యపరాక్రమ ప్రతాపములచే శత్రుకుల విధ్వంసనము కావించుచుండిరి. మహమ్మదీయులు రాష్ట్ర స్థాపనుల కై ప్రయత్నించుచుండిరి. హిందువులు స్వా తంత్ర్యాభి లాషచేఁ బ్రాణములను విడువ సంసిద్ధులై యుండిరి. హిందూ దేశమునం దెల్లెడలఁ బౌరుషము, స్వాతంత్ర్యాభిలాష, ప్రతాపము, పరాక్రమము, శౌర్యము, దేశాభిమానము, మొదలగు గుణములు విస్తరించి సామ్రాజ్యముల నెల్లఁ గదల్చి వైచుచుండెను.


ద్రోణానది కృష్ణాతరంగణి కుపనది. కృష్ణా ద్రోణా సంగమమునకు సమీపమున సుప్రసిద్ధమగు తలికోటకలదు. .