ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

5


వోవుచుండెను. అతని హృదయ మాతురతతో నిండి యుం డెను. బుద్ధిసాగరుఁడతనిని వెంబడించెను. ప్రస్తుతము • బుద్ధిసాగరునకును, శ్రీధరునకును, గలనం బంధ మేమో తెలిసికొనవలయునని మీ హృదయము తొందర పడుచున్నదా ! ఈ యిరువురును బాల్యమునుండి మిత్రులు, సహాధ్యాయులు. ఇరువురును జాణక్యాది మహాశయులచే రచిం పఁ బడిన న్యాయశాస్త్రంబులను, ధర్మశాస్త్రములను, రాజు కీయవిజ్ఞాన శాస్త్రంబులను, సమముగాఁ బఠించిరి. వారిరు వురకుఁ బరస్పరము స్నేహ మమితము. శ్రీధరుఁడు సన్యసించి తన సర్వమును దేశ క్షేమమునకై వినియోగించు చుండెను. బుద్ధిసాగరుఁడు మంత్రియై దేశ క్షేమమును బాలించుచుండెను.


అట్లు వారిరువురును గమ్యస్థానమున కరిగిరి. అంత శ్రీధరుఁడు “మిత్రమా! సత్వరముగాఁ జెప్పుము. నామనము కల వరపడుచున్నది. విజయనగర సామ్రాజ్యమునకుఁ జిక్కులు తటస్థించినవిగా?” అనెను.


బుద్ధి :-ఆ ! సమీపించుచున్నవి. కాలసర్పమును బక్క క్రింద నంచుకొని నిద్రించువానికిఁ జావు రాకుండఁగలదా !

శ్రీధ: అవును. నీనన్నది యాదిల్ శాహాను గూర్చి కాదా ? అతఁడంత పనికిఁదగినవాఁడే. అయ్యో !రామ రాజా! నీ వివేక మెల్ల నే మైపోయినది?