ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

219


“ సుందరీ ! వీరపత్నీ నామమును సార్థకము చేయుచు న్నావు. కాని నీవంటి పూవుంబోడిని కదనమునకుం దీసికొని పోయినఁ జాలకష్టములు వచ్చును. నేను వచ్చునందాఁక యో పికమై నుండుము. నా విరహము నీ కెంత దుస్సహమో నీ విరహము నాకు నంతదుస్సహమే '


"మనోహరా ! మీదగ్గఱనున్న నా కాకష్టములన్నియు సుఖముగాఁ బరిణమింపఁగలవు. మీరు లేని యీగృహము నాకుఁ గారాగారము. నన్నీ కారాగారమున బంధించి పోవఁ కుఁడు. నా ప్రార్థన మాలింపుఁడు. మన్నింపుఁడు '


“ సుందరీ! తురకలతో ఘోరయుద్ధము జఱుగును. అందుఁ బెక్కుమంది. దేశరక్షణార్థము మడియ నున్నారు. యు ధ్ధములోనే దెట్లగునో నిర్ణయింపరాదు. తురుష్కులు పాపా త్ములు. స్త్రీలచ్చటికి వచ్చిన మానరక్షణము దుర్లభము. ”


'మనోహరా! నా యీముద్దు చెల్లింపరా? ఈ జగన్మో హినికూడ వలసెనేని దేశరక్షణకుఁ బ్రాణము లర్పింప సిద్ధము. గానున్నది. పవిత్ర జీవిత విభాసురులై కీర్తిం గాంచిన యోధులే నశియించుచుండ నావంటి వ్యర్థురాండ్రుండి యేమిచేయుదురు?

హిందూసుందరీమణులకు మానభంగము చేయుటకు తురకలే కాదు, ప్రపంచములో మతెవరును సమర్థులు కారనుట మీరే ఱుఁగరా.! తురకలిదివఱ కెన్ని సారులు చిత్తూరును సాధించి యందుఁ బ్రవేశించి విఫలమనోరధులైరో మీకు విదితము