ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

205


కాని సోమ శేఖరమూర్తికిం దగిలిన గాయములు మిక్కిలి భయంకరములుగా నుండెను. అతని యారోగ్యము నానా టికి క్షీణింపఁ దొడఁగెను. దేహమున దౌర్బల్య మతిశయిం చెను. అన్న ద్వేషము జనించెను. లోని కాహారము పోవుట లేదు. అందుచే శరీర మెల్లఁ గృశించుచుండెను. అతఁడు తానిఁక విశేష కాలము జీవింపనని తలంచెను. అతనికిఁ గ్రమ ముగా రాధాకుమారుని వృత్తాంతము తెలిసెను. పూర్వము స్వర్ణ కుమారిచేఁ బ్రేమింపఁబడిన రాధాకుమారుఁ డప్రయ త్నముగా తమకు మరల దొరకినందుల కతఁడపరిమి తా నందము నందెను. రాధాకుమార స్వర్ణ కుమారులయు,జగన్మో హినీ విజయసింహులయు వివాహములు కండ్లార జూడవలయు నని యతనికిం గోర్కె పుట్టెను.


వివాహ ప్రయత్నములు కావింపఁబడెను. శుభ ముహూ ర్తమున నత్యంత వైభవముతో స్వర్ణ కుమారీ రాధాకుమా రులకును జగన్మోహినీ విజయసింహులకును వివాహములు కావింపఁబడెను. విజయనగర పట్టణముననున్న రాజులు,మంత్రు లు, జమీందారులు, విద్వాంసులు, అందఱును వివాహమునకు వచ్చి సమ్మానములంబడసిరి. విశ్వాసార్హుర్లు డయిన సేనాధి పతియగు విజయసింహుని తద్ధర్మపత్నిని, రాధాకుమారుని తద్ధర్మపత్నిని, తత్తదుచిత మణిమయాలంకార భూషణములచే రామరాజు సమ్మానించెను.