ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

విజయనగర సామ్రాజ్యము


లీ సుందరీమణులు పొందుచున్న కష్టములంజూచిరి. వారి నెట్లేని రక్షింపవలయునని తలంచిరి. వేసవికాలము నందలి యత్యంత తీక్ష సూర్యకర జ్వాలలచే మండి భస్మమయి పోవు చున్న వృక్ష సంతతులను జూతుము. సాయము చేయము. ఊరకుందుము. కాని యేఫలమును గోరక నిలాంబుదము లతి శీతల జలబిందు నిక్షేపణము కావించి వానిని నూత్నైశ్వర్య సంశోభితములనుగాఁ జేయుచుండును. అది ప్రకృతి సిద్ధము. నాటి రేయి చీకటిలో గోల్కొండనవాబు పట్టమహి షిని ముద్దు పెట్టుకొని యామెయొద్ద సెలవుంగైకొని విజయ నగరమునకుఁ బ్రయాణ మైవచ్చిన యాసుకుమార కుమార ద్వయమును మరల నొకపరి మీ హృదయ సీమలయందు నిల్పుఁడు. వా రెవరు? స్వర్ణ కుమారీ జగన్మోహినులు! గోల్కొండ నవాబు పట్టమహిషియే ఆ యు క్తిని బన్ని నది. స్వర్ణ కుమారీ జగన్మోహినులు నిజరూపములతోఁ బోయిన వారికి హాని గల్గు నని తలంచి యిట్లామెచేయించెను.


గోల్కొండ భటులు తమ్ము విడిచి పోయిన వెనుక వార త్యంత కష్టముతో విజయనగరమున కరిగిరి. పాపము ! రాత్రి యుద్ధములో వారికి గాయములు తగిలెను. దీర్ఘ ప్రయాణముచే నలసిరి.విజయనగరముం బ్రవేశించుసరికి వారికి బ్రాణ ములు సరిగా లేవు. అచ్చట నేడెన్మిది దినములలో , స్వర్ణకు మారీ జగన్మోహినుల గాయములు గుదురఁ దొడంగెను.


|