ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

విజయనగర సామ్రాజ్యము


నపుడతని యాజ్ఞను గైకొని మఱిగుఱ్ఱము నధిష్టింపవలయు నట ! దినదినము క్రొత్తయాజ్ఞలు బయలు దేరుచున్నవి.


నవాబు : ఏమీ!ఇట్టి యాజ్ఞలిదివఱకు లేవే! ఓరీ రామ రాజా! నీ కెంత పొగ రెక్కుచున్నదిరా ! ఇంతకును మాలో మేమిది వఱకుఁ గలహించుటం జేసి నీయాటలు నేటివఱకు సాగు చున్నవి. ఇక సాగించు కొందువుగాని లే. మే మిదివఱ కాచరించిన పనులన్నియు నిపుడీ వాచరించుచున్నావుగా? అవి తురకలకుఁ జెల్లును. వారు మీరాయ బారులను నిల్వ బెట్టించి మాట్లాడవచ్చును. మఱి యేమేసి చేయవచ్చును. కాఫరునకు నీకుఁగూడ నివి చెల్లునా ! ఇంతకును వినాశ కొలము...........


ఇంతలో నొక సేవకుఁ డొక యుత్తరముం దెచ్చెను. మంత్రి గైకొని యిట్లు చదివెను.


“అయ్యా ! మీ దయవలన నన్ని కార్యములును గొనసాగినవి. విజయనగర సామ్రాజ్యమును విధ్వంసముచేసి హాయిగా నిర్భీతిగాఁ గాలము గడుపుకొనవచ్చును. నేను మీరుగాక గోల్కొండ నవాబుకూడ మనలోఁ జేరఁగలఁడనుట మీకు విదితమే. ఇపుడు శ్రీ బేదర్ నవాబు బర్ద్ శాహా కూడ నిందు లోఁ జేరినాఁడు. మనమతమును, ఆంధ్రులు నాశముచేసి పరా భవము చేయుచున్నారన్న మాట మీరు మజువఁగూడదు.