ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

విజయనగర సామ్రాజ్యము


. విజయనగర పట్టణము కలఁగుచున్న మహాసముద్రము వలె నుండెను. దర్బారు గావింపఁబడెను. చక్రవర్తి నోటినుండి ఆదిల్శాహా యంపిన రాయ బారము వినఁగనే ప్రజలు ద్రేకముచే మండిపడిరి.

“ ఆదిల్ శాహాను బట్టి ఖండఖండములుగా నరికినను బాపము లేదు”

“ఓరీ ! దురాత్మా! నిన్నటిదాఁక కుక్కవలే మావిజయ నగరమున సంచరించిన నీకెట్టి పరాక్రమము వచ్చినదిరా! ”

'అయ్యా ! ఆతుచ్ఛుని పైకి నన్నంపుఁడు. డేవరవారి యుప్పు తిన్నందులకు తీరువవలసిన ఋణమును దీరిచి ధన్యుఁడ నయ్యెదను"

'ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మికి నూతన యౌవనము సంప్రా పించుచున్నది. అందుచేతనే శత్రువులకిట్టి పోఁగాలము సమీ పించుచున్నది.

'నాకా దుర్మార్గుం బట్టి తేవలయునని చాల గోర్కి కలదు. దేవర యానతీత్తురేని యతనిం దెచ్చి తమ పాద పద్మ ములకడ నుంచెదను ”

అనుచు కొందఱు గొణుగువారును, మఱికొందఱు వీరులు లేచి సభలోఁ బలుకువారునై యుండిరి. ఏకగ్రీవముగా సభ్యు లెల్లరును యుద్ధము చేయఁ దీర్మానించిరి. సభ సంక్షో భింపఁ గడంగెను. కొంద జాంధ్ర జాతీయగీతములం బాడిరి.