ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

3.


కోకిల మాత్రమప్పుడప్పుడు 'కూ' యని పాడకమానినది కాదు, అతఁడింకను బాడుచుండెను. అతని కను అర్ధ నిమీలితములై చలించుచుండెను. మొగము పరమానందమును సూచించు చుండెను. శాంత భావము . తృప్తి , నైర్మల్యము తప్ప, మఱొక వికార మందుఁ గన్పట్టుట లేదు.

అతఁడా. వీణెను గ్రిందనుంచెను. ఆ మొగమింకను శాంత భావమును బ్రస్ఫుటము సేయుచుండెను. ", అకనులింకను హర్ష ప్రపూర్ణము లై తోఁచుచుండెను. ఒక నిముసమతఁడటు నిటు చూచెను. అంత నతనికిఁ గృతపరిచయమగు మానవ విగ్రహ మొకటి కన్పట్టెను.

ఆ యుటజమునకు దారులు 'పెక్కులు గలవు. అందు పెక్కుదారులు రహస్యములయినవి. వాని నితరు లెఱుఁగరు. అతని మిత్రులు కొందఱు మాత్ర మేఱుగుదురు. ప్రస్తుత మీ పురుషుఁడందొక త్రోవనుండివచ్చెను.

అతనింజూడఁగనే మన శ్రీధరుని హృదయము ధుమ దినీ మనోహరుంగాచిన కల్వయుంబోలే వికాసవంత' మాయెను. తోడనే యతఁడు “ఓహో! బుద్ధిసాగరా! ఎన్ని నాళ్ల కుదర్శన మిచ్చితివి? మామీఁద' దయ రాలేదు గాఁబోలును ?? అని,యెను.

బుద్ధి:-అవును, చిరకాలమే యైనది. మీయజ్ఞ యాగాదులన్ని యు' నిర్విఘ్నముగా సాగుచున్న నా ?