ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరు వ ది యే డ వ ప్రకరణ ము

ఆంధ్రులు

దు గోల్కొండ నవాబు రామరాజచక్రవర్తిచే పంపఁబడిన రాయబారి నట్లు తిరస్కరించుట విజయనగర పట్టణములో నా బాలగోపాలమును దెలియవచ్చెను. బాల్యము దాటి వయసు వచ్చిన ప్రతి యౌవనుని హృదయమును రోషపూరితమాయెను. సైనికులు మండిపడిరి. యోధుల ఖడ్గములప్రయత్నముగనే యెగిరి తురుష్కకుల విధ్వంసనమునకుఁ బర్వులెత్తసాగెను. ఆ మహానగరమున నున్న యాంధ్రులు, కర్ణాటులు, ద్రావి డులు, ఇంతయేల ! సర్వహిందూ జాతులును దురుష్క వినాశ మును జేయుటకు సన్నద్ధులై యుండిరి.

వేలకొలఁది కుమారు లాంధ్ర సామ్రాజ్యమునకుం గల్గిన యీపరాభవమును దీర్చుటఁగాని చచ్చుటఁగాని కావించెద మని తుంగభద్రాస్రవంతీ పవిత్రజలములను స్నాసముచేసి పరి శుద్ధులై శపధముచేసిరి. ఆంధ్రయౌవనవతులు పురుష వేషము లందాల్చి యుద్ధరంగము నకుంబోవ సన్నద్ధురాండై యుండిరి. వీరమాతలు తను కుమారరత్నములకు వలయు నేని సమర రంగమునంజచ్చి యాంధ్రపౌరుషమును నిల్పుఁడని బోధించుచు వారినట్లు చేయఁ బ్రార్థించుచుండిరి. మహాకవులు వీరరసోత్సా