ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

187

"

అతఁడు సందేహించెను. ఆభటుని సం దేహము నతఁడు కన్పెట్టెను.

“సం దేహింపక త్వరగా చెప్పు. సమయము మించి పోవుచున్నది”

“ అచ్చె పై మీక్కోపం వస్తుందండి ! "

“ నాకు కోపము రాదు. నీమనమ్సలో నేమున్నదో దాఁచక త్వరగా నాకుఁ జెప్పుము. నేను వీలయినఁ జేసి పెట్టె దను"

ఆ యిద్దర్లో నాకొక పిల్లని దయ షేయించాలి ”

ఆ మాట యతని మనస్సునకుఁ గంటకమాయెను. కాని యతఁడు దానిం గప్పిపుచ్చెను. తనలోఁ దానిట్లనుకొనెను. “ఈ మోటవాని కా సుందరీమణులలో నొక్కరితె కావ లయునట ! కానిమ్ము ! ప్రస్తుతము గడువ వలయు. తరువాత గాని యితనిని సుళువుగా వంచింప వీలు లేదు.”

అతఁడు మెల్లఁగాఁ బయికిట్లు చెప్పెను.

“ ఇందుల కేనా యింత సంశయ పడుచున్నావు. దీని కింతగా సంశయింపవలసిన యగత్య మేమిక లదు. కార్యమునకుం గడంగుము, నీ యిష్టము నట్లే నెఱు వేర్చెదను లే.” ఆభటుని హృదయమున నూత్న మనోరధములు మొల కెత్తెను. అతనిముఖము సంతోషపరీవృతమాయెను. అతం