ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదిమూఁడవ ప్రకరణము

179


గ్రుచ్చుచు, ఒక నిందలత్రుంచుచు నతఁడు స్వేచ్ఛావిహారము చేయుచుండెను. కాని పాపమతనికి శ్రమ హెచ్చెను. ఇఁకఁ బోరాడఁ జాలకుండెను.

సోమ సేఖర మూర్తికొక పెద్ద గాయము వీపునందగిలెను. రక్తస్రవంతి ప్రవహించుచుండెను. పాప మతనిపనియైనది.

వీరండఱి కంటెను ముందునకుఁబోయి తమనాయకులకు దెబ్బలు తగులకుండవలయునని శత్రుభటులను గవిసిపోరాడిన మహారాష్ట్ర వీరులను జూడుఁడు ! స్వామి భక్తియన్న నిజముగా వారిసొమ్మే. స్వామి ఋణమును దీర్చుకొనుటకై వారి నల్వుర లోను మువ్వురు గతించిరి.

గోల్కొండ భటులకున్నంత వీలు వీరికి లేదు. వారింకను బది పండ్రెండుగు రుండిరి. వారెల్లరు వీరులు, యోధులు. వీరో పిల్ల వాండ్రు, సుకుమారులు, స్త్రీలు, ముసలివాండ్రు. ప్రాణభయమున వారిందులకుం దెగించిరి. సహాయము వచ్చు వారెవరును గన్పడ లేదు. ఏదిక్కును లేనివానికి దైవ మేదిక్కం దురు. కాని వారి కదియును గన్పట్టినది కాదు. ఏమియుఁదోఁచ లేదు. రాధాకుమారుఁ డొకరి నిరువురను మూగురను , నల్గు. రను జంపెను. వారికి బల్లెములుకలవు. వీరికి లేవు. ఆ .నట్టడవి యందు, ఆ నిర్జనస్థలమున, ఆసుకుమారులు, ఆ సౌందర్యవతు