ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదిమూఁడవ ప్రకరణము

177

'


"నిజమే. ఇరువదిమందికంటె హెచ్చుగా లేదు ”

“ లేదు. పాతికమంది యుందురు. సందియము లేదు”

“ వెనుక కుందిరిగి మార్కొనుఁడు. వచ్చినారు. మన మీఁదం బడుదురు అని యొకరితోనొకరు సంగతులు చెప్పుకొనుచుఁ బరస్పరము హెచ్చరించుకొనుచు, అందఱును వలయు నాయుధ ములఁగొని సిద్ధముగా నుండిరి.

"ఆ గం డాగండి! యెక్కడి కెళ్తారింకా ? '

“ అడముండలట్లే పారిపోతారేం. మీ కేం పౌరుసంలేదా?”

“ నిలండి నిలండి! ' అను కేకలు నార్పులు వినంబడెను. ఆ కేకలు రాధాకుమారునకును, దక్కిన వీరులకును ములుకులై తోచెను. ఆ వీరుల ముఖముల నుండి దుర్నివార్యమై, భయంక రమై, శత్రుశుష్క మహీరుహ విధ్వంసన సమర్ధ శిఖజ్వాలాయ మానమై క్రోధరసము నిరంతర ధారగాఁ బ్రవహించుచుం డెను. ఆ భటుల దుర్భాషలు వారిని వ్రేటుందిన్న బెబ్బులులను జేసెను. కండ్ల నుండి నిప్పుకలు రాలుచుండెను. “ రండు ! రండు ! వ్యర్థ ప్రసంగము లేలఁ జేసెదరు ? మీ మగఁటిమి చూపుఁడు. భవత్కంఠ విలుంఠ నోత్సాహమునం గాలసర్పములవలెఁ బ్రకాశించుచున్న మాఖడ్గముల నెదిర్చి నిలువుఁడు.