ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

విజయనగర సామ్రాజ్యము


గమ్యసాన మింకెంతదూరమున్నది?”

'ఒక మయిలుకంటె నెక్కుడుదూరముండదు ”

అని వారిగుఱ్ఱములవడి యెక్కుడుచేసిరి. అవి వాయు వేగమునం బరువిడుచుండెను.

వారట్లుపోయి యొక భీక రారణ్యముననున్న యొక రహస్య ప్రదేశముం జేరిరి.

అచ్చటఁ గొన్ని గుఱ్ఱములును, గొందఱు సేవకులు, భటులు, మఱికొందఱు స్త్రీలు నుండిరి. అం దిరువురు సుందరీ మణుల, నీ చీచీకటిలో మనము వారి దుస్తులంబట్టి, జగన్మోహినీ, స్వర్ణ కుమారు లనుకొనవచ్చును.

అచ్చటనున్న భటులు మహారాష్ట్రులు. వారు మిక్కిలి దేశాభి మాసముగలవారు. వారే యీ రహస్య స్థలమునకు గుఱ్ఱములను మన ప్రయాణికులకు సందఱకును దెచ్చినవారు. ఆ ప్రదేశముననున్న వారికెల్లరకు నానావిధములగు నాయుధ ములు గలవు. మన యాశ్వికు లచ్చటి కేగిన వెంటనే వారం దఱు నొక్కపరి సంతోష తరంగములలో ముగ్గరి. బేగము సాహెబు 'అమ్మా ! ఇఁక ద్వర పడుఁడు. లేని యెడల గష్టములు సంప్రాప్తించును' అనియెను. 'అమ్మా! మీదయను మేమెప్పుడును మజువఁజాలము. వందనములు. సెలవు దయచేయుఁడు' అని వారెల్లరు నేక గ్రీవ ము గాననిరి..