ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయనగర సామ్రాజ్యము


. ఆ యధికారి బయటి కెదురుగా వచ్చెను. అతఁడీ యశ్వా ధిష్ఠితుఁడగు పురుషునిజూడఁగనే, ఇతఁడొక యున్నత వంశీ కుఁడై యుండునని తలఁచెను.

'అయ్యా ! ఏలవచ్చితిరి?'

  • చిత్తము. జగన్మోహిని తల్లిదండ్రులను దీసికొనిపోవుటకు

మాకింక నవాబుగారి యనుజ్ఞ కాలేదు ”

“ ఇదిగో ! చూడుడు "

అని యాముద్రికనే చూపించెను. అతఁడు విశ్వసించెను. ఆలస్యముచేసిన నేమియగునోయని భయంపడెను. నిరంకుశ ప్రభువుల హృదయములను జక్కగా నతఁ డెఱుఁగును.

' అయ్యా ! వచ్చుచున్నాను' అని యింటిలోనికిం బోయి యొక టోపీని దగిలించుకొని సేవకు నొకనింబిల్చి ' తాళ పుం జెవులను దీసికొనిరా !' అని చెప్పెను. తోడనే సేవకుఁడు వానినిగొని పరువెత్తుకొని వచ్చెను. ఆ యధికారి యాయశ్వా ధిష్టితుని బ్రక్క నడచు చుండెను. అతని ప్రక్క గుఱ్ఱములు నడచుచుండెను. తాళపుఁ జెవులం దీసికొని వచ్చిన సేవకుఁడు వారింగలిసి కొనెను. వారందఱు నాభ వనములయొద్ద కేగిరి. ఆయధికారి " తాళముతీయరా' అనెను. తీసెను. లో నంబ్రవేశించిరి. అందు సోమ శేఖర మూర్తీయు, భార్యయు నుండిరి.