ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము

157


నవాబు, ఆతురతతో నిజముగాఁ జూచితివా?” అనెను,

అయ్యా ! చూచితిని "

“ ఏ వయిపుగా వచ్చినారు ? "

ఈ ప్రక్క బజారునుండి వచ్చినారు.”

" ఎందఱు ? "

“ ఇరువురు.".

" హిందువుల వలె నున్నారా ! మహమ్మదీయులవలె నున్నారా? '

మహమ్మదీయ స్త్రీలవ లెనే యున్నారు. ఆపాదమస్త కము వస్త్రములు కలవు. వారి కందె లున్నట్లున్నవి. అవి మ్రోగుచు నుండెను.”

"వా రేవయిపునుండి వచ్చుచున్నారో కనిపెట్టి చూచి తివా?" 'ఆ?! చూచితిని, వారంతఃపురము వైపుల నుండియే వచ్చినారు.

“ఏల చూచెదరు. చాలమంది ట్లే చెప్పుచున్నారు. వారు నిశ్చయముగాఁ దమ్మెవ రేని పట్టుకొందురని మహమ్మదీయం గనల వేషములంధరించి వచ్చినారు. అనేకమంది వారిని, వేషములతో నుండఁగా జూచిరి. వారింక ను బడలేదేమో యీ ప్రాంతములను వెదకుఁడు. ఆ చెరువు ప్రక్కలఁజూడుఁడు. గట్ల