ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

153


బడుట యుక్తము కాదు. మీ రన్యతంత్రులు. మమ్మెట్లు రక్షింపఁగలరు ?

రాధా - భారతీయార్యర క్తమే నాయందుఁ బ్రవహించు నేని నే నాంధ్రుల యుత్తమ సుగుణములు కలవాఁడనేని నాప్రాణ ములు పోయినను మీప్రాణములను గాపాడ వెనుక దీయ కుందును గాక !

స్వర్ణకుమారి హృదయము నా వీరాలాపములు కరం చెను. ఆమె వీరవనిత.

జగన్మో:-మా యందు మీకంత యనుగ్రహముండుట మా యదృష్టము కాక మఱేమి?

రాధా:-సోదరీ ! ప్రొద్దుపోవుచున్నది. సెలవు తీసికొనెదను.

జగన్మో: మంచిది. నన్నును స్వర్ణ కుమారిని మాత్రము మఱువ కుందురుగాక! సెలవు.

రాధా:-స్వర్ణకుమారీ ! పోయివచ్చెదను.

ఆమె హృదయ మౌత్సుక్యమండిత మాయెను. నోట మాటరాలేదు. మెల్ల గా ఓ చిత్తము ' అనెను. ఆ సుందరీసుంద రులు పరస్పరావలోకనము గావించిరి. వారెడబాసినను వారి హృదయములు బంధింపఁబడి నట్లే యుండెను. అతఁడు వెళ్ళ లేక వెళ్ళెను.