ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

147


ర విడువనే విడువరు. ఎన్ని కష్టములు జనించినను విడువడు! పరాధీనవృత్తి బానిసవృత్తి. తన వ్యనహారములు చూచుకొను టకుఁ దన కధి కారము లేదు. ఒకరిక్రింద తాను బానిసగా నుండవలయును ! తానెందునకుఁ బనికి రాడు ! అతనికి గౌరవము లేదు ! ఎందుకా బ్రదుకు ?

పాపము ! చెజసాలలోఁబడిన జగన్మోహినీ స్వర్ణ కుమా రుల తరువాతి వృత్తాంత మేమయినదో కనుంగొనవలయును. జగన్మోహిని యొక్క ప్రీతి నేవిధమున నయిన సంపాదింప నలయునని నవాబు దినదినము మధురములయిన కదళీఫలము లను దాడిమఫలములను మఱియు నానావిధ ఫలములను బంపు చుండెను. బంగారుజరీతో , బనిచేసిన పట్టు పుట్టము లాపెకుఁగొ దువ లేదు. సేవకులు కొల్లలు. సువర్ణమయరత్న ఖచిత మనో హరానర్ఘ భూషణములతో నా సౌధము నింపఁబడుచుండెను. చంద్రహారములు సూర్యహారములు మొదలగునవి వలయు నన్ని ! కాని యవియన్నియు నెవరికి వలయును. ఆపె వాని వంకఁ గన్నెత్తి యయినఁ జూడ లేదు.

మొదట నా మేను విచారించుటకును, అమెకు సేవ చేయుటకును దురకలను నియోగించెను. కాని యది యాపె కిష్ట ముగానుండ దనుకొనెను గాబోలు నవాబొక హిందువు నధి కారిగా నియోగించి హిందూ సేవకుల నేర్పఱచెను. కాము కులకుఁ దమకోరిన సుందరీమణుల నెట్లేని మెప్పించవలయు