ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవ ప్రకరణము


అని ' యామె చేతికొక చిత్రపలకము నందించెను. అం దొక దివ్యసుందర విగ్రహము చిత్రింపబడియుండెను. అది నిశ్చ యముగాఁ జిత్రప్రతిమయనుటకు వలనుగాక యుండెను. అందు జీవలక్షణములన్నియు వ్యక్తము లగు చుండెను. అది నిజముగా ప్రతిమకాదు.

ప్రాచీన హిందూనాగరకతను జాటుశాస్త్రములలో శిల్పకళాచాతుర్య మొకటి. అందీ చిత్ర లేఖనము మిక్కిలి హృద యంగమైనది. ప్రకృతి సౌందర్యమును, మానవ విగ్రహము లను, ఆయా భావములతోఁగూడ లేశ మేనియుఁ దప్పకుండు నట్లు సహజముగాఁ జిత్రింపఁగల సుప్రసిద్ధ చిత్రకారులు నేటి వఱకును గలరు. వారు హిందూ దేశప్రాచీన వైభవమును, నాగరకతను, శాస్త్రసంపదను దమచిత్రముల మూలకముగా గానము చేయు చుందురు.

ఆ చిత్ర పలకమును జగన్మోహిని వీక్షించెను. ఆమెకుఁ దృప్తితీర లేదు. నీలోత్పల దళముల నధఃకరించుచున్న యాపె కనుల నీరు గ్రమ్మెను. అది యప్రయత్న సిద్ధము, సహజము. ఆమె దాని నాపుటకుఁ బ్రయత్నించెను. కాని సాధ్యమాయెనా! ముత్యముల వలె నాబాష్పబిందువు లాసుందరి తొడల పై బడుచుండెను. అది యా యవనసుందరి కని పెట్టెను. ఆమె ఫక్కున నవ్వెను.