ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

విజయనగర సామ్రాజ్యము


మహిషితో దాఁచి చెప్పుట కామె యిష్టపడ లేదు. నవనీత కోమ లమైన యామెహృదయము చలించుచుండెను.అది సరళ మైనది. వక్రతగాని కపటముగాని యందు లేదు. ఆ స్వర్ణ కమలమునుండి యస్పష్ట మై, మంజులమై, త్రిపావృతమై, అను రాగద్యోతకమై, శ్రవణామృతమై, సుఖకరమై, సుకుమారమై, కుసుమసార సమాకర్షణ లోల మధుకరీ కలనిన్వనములను హసించుచున్న యొక మధురవాణి వెల్వడుచున్నది!

“ అవును. అదిస క్తమైనది ' అనెను.

ఆ యవనసుందరి ముఖమునుండి మందహాసత రంగిణి ప్రవహించుచుండెను. అది ప్రయత్న పూర్వకముగాదు. సహజము. . అది యెవనియందు లగ్న మైనదో యతఁడు ధన్యుడు. ఆ యదృష్ట వంతుఁ డెవరు ? ”

ఆమె యుత్తరమును నిరీక్షింప లేదు. ఆమెకు ప్రాచ్య సుందరీమణుల వర్తనము తెలియును. ముద్ధాతరుకాల భావ ములు ప్రౌఢములు కావు. కోమలములు. ఆ పై ప్రత్యుత్తరము చేయ లేదు. అది నిరాకరణము కానేరదు.

“పోనిమ్ము. నారీరత్నమా ! ఒకసారి నీ దృష్టి నిటుసారిం చుము. ప్రకృతిసుకుమారములగు నంకకములతోడను అత్యు త్తమ లక్షణశోభితమగు మోముఁదమ్మితోడను సకల జగ న్మనోహరముగా నున్న యీమూర్తి యెవరిది ? ”