ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

విజయనగర సామ్రాజ్యము


లేక. సర్వవస్తు శోభితములగు నీ సౌధ పరంపరలతోడ నేమి ప్రయోజనము ?

“అది, ఎందుచేత "

“ పాదుషాలు బహుసుందరీప్రియులు'

జగన్మోహిని 'అది కష్టమే' అనెను.

నారీలోకమునకు మనోరధములు సమానములు. వారికిఁ బరుల కష్టములయందను తాపము స్వాభావికముగా జనిం చును. ఇతరుల కష్టములను జులకనగా వారు గ్రహింతురు.అపు డామె మొగ మను తాపసూచకముగా నుండెను.

సుందరీరత్నమా ! హిందూరాజులలోఁ జాలమంది యేక పత్నీ వ్రతముకలవారఁట'

అవును. రాజపుత్రులలో, ఈ యాచారము వి శేషించి కలదు.”

'అది చాలమంచిది'

'ఈ యాచారము మీలోను గలదనివింటిని ' . ' ఆఁ! కలదు కాని నవాబుల దర్బారులకది పనికి రాదు.' ఆమె కొంచెము సేపూరకుండెను.

“సుందరీరత్నమా! స్వభావజన్యమగు చాపల్యమునకు లోనై యొక విషయము నడుగ నుపక్రమించు చున్న దానను. స్నేహధర్మములో నీవు వేఱుగా భావింపవుగదా! ”