ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవ ప్రకరణము

139


" నిజముగా మే మదృష్టవతులము కాము '

“ ఎందుచేత! మీకంటె నదృష్టవతులు లేరని చెప్పు టయా?

" హిందూయువతు లదృష్టవతులు'

"నేనట్లు తలఁపను. యవనసుందరులు స్వాభావికముగా సౌందర్యమును ప్రేమింతురు. ప్రపంచమునంగల సర్వసౌభా గ్యములకును,సర్వసుందర వస్తువులకును వారి సౌధములు నిలయ ములు. అత్యంత మధురమైన గానమును నిత్యము నాకర్ణిం తురు. దేహములను జక్కగాఁ బూల చేతను లతల చేతను,, చిత్ర చిత్రముగాఁ జిత్రింపఁబడిన మొఖ్ మల్ గుడ్డలచేతను పట్టు పావడల చేతను శోభస్కరముగా నలంకరించుకొందురు. వారి కింకఁ దక్కువేమి ? "

వారి సౌభాగ్య మంతవజ కే”

జగన్మోహిని, గ్రహించెను. ఊరకుండెను.

మాకును, అదృష్టమునకును జలదూరము. మేమీ సౌధ పంజరములందు బంధింపఁబడిన విహంగములము. మా కాలమును సౌందర్యమును యౌవనమును, భూలోక సృష్టి, వినో దములను మనోహరవస్తు ప్రపంచమును జూచుట తోడనే సరి పోవును. హిందూసుందరీమణులు తమ మనోహరుల హృదయ ములను హరింతురు. ఆ భాగ్యము మాకు లేదు. పరస్పరానురా గము, ప్రేమ, యివి మేమనుభవింప నోఁచుకొన లేదు. అది