ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

విజయనగర సామ్రాజ్యము


జగన్మోహినికిఁ గొంచెము చనువుచిక్కెను. ఆపె యిఁకఁ బ్రశాంతశీలయై యుంటమంచిది కాదని తలఁచెను. బేగము సాహె బంత విధేయతతోఁ దనవంటి సామంత ప్రభువు కూతును స్నేహముకొఱకు యాచించుట తనకు శుభకరమని యాపె తలఁచెనా యేమి ? ఆమె మొదట నింతసన్మానము జఱుగునని తలంచియుండ లేదు. ఇట్ల నెను.

'యవన సుందరీమణులు చమత్కారవతులు. చలోక్తు లకును చమత్కారములకును వారిసంభాషణములు పుట్టినిండ్లు అనివింటిని. అది నేఁడుకంటిని'

ఆయవనసుందరి మోముదామర వికసించెను. సోగ లైన యా పెకన్నులు విరళమాయెను. “ఇపు డీమెకుఁ గొంచెము సిగ్గుతగ్గినది' అనుకొనెను.

వారు హృదయాకర్షణమున సమర్ధురాండ్రు. సర్వ సౌఖ్యవతులు."

“ అదిమాత్రము సరికాదు. చమత్కార ప్రసంగముల కును, సమయోక్తులకును, చలోక్తులకును, చాతుర్యములకును, సోదరీ! నీవన్నట్లు మేము సుప్రసిద్ధురాండ్రమే. హృదయాకర్షణ జేయు సామర్థ్యముకూడ మాయందుఁగలదు కాని యదృష్టము'.

ఆపె నిట్టూర్పు విడిచెను. ఆమె మొగము విరక్తిని సూచించుచుండెను.

'అక్కా ! అట్ల నెద వేల ? "