ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవప్రకరణము

137


ప్రగల్భశీలత యుండదు. శాంతభూషితలు. వారుమాటలాడు నప్పుడు మనోజ్ఞమై లజ్జ ముఖమునకు వన్నె గల్గించుచుండును.'

“ అవును. మీరెఱుఁగని దేమికలదు ? ”

కాని సోదరీ! మనము కొంచెము సేపదిమఱచి విచ్చల విడిగా మాటలాడుకొందము '

ఆమె భావమును సంపూర్ణముగా జగన్మోహిని గ్రహిం చెను. చిఱునవ్వంకురించెను. అది యామె స్వభాన రమణీయ మగు ముఖమునకు వన్నె బెట్టెను.

' అందుకు నాకుఁ గూడ నిష్ట మే ”

స్త్రీలకు మైత్రియం దపేక్ష, మెండు. అందుచే నే నీ మైత్రిని గోరుచున్నాను "

'నామైత్రివలన మీకు లాభము కల్గకపోవచ్చును. కాని మీమైత్రి మాకత్యంత మవసరమైనది. మీదయ మాకుఁ గావల యును. మామైత్రిని మిరపేక్షించుటకు మేమెంతటి వారము? అది మీకరుణయే '

• సోదరీ ! అట్లనఁబోకుము. వయసునఁ జిన్న దానవై నను నీవు పెద్ద దానవే. నీ సుగుణసంపద లిదివఱకే జగత్తునం దెల్లఁ బ్రసిద్ధములు. మైత్రికిఁ బరస్పర సుఖదుఃఖ నివేదనము కావలసియున్నది. అందొక పక్ష, మున్నతమైనచో నసహ్యము. నేనొక విషయమునఁ బెద్దను. నీ వొకవిషయమునఁ బెద్దవు. కావున మన మైత్రి సమానముగా శోభింపఁగలదు ' .