ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

131


సయంశమునఁగాని చక్కఁగాఁజర్చింపక ప్రవేశింపరు. అట్టి చోఁ దన్నెవఁడో యొక నూతన పురుషుఁడు వచ్చి మిమ్ము జెఱ నుండి తప్పింతును, రండు అనియొక యుత్తరమును జూసించినంత మాత్రమున నదియెల్ల విశ్వసింతురా ! దూరగ్రహణైక సమ మగు వారి బుద్ధియందు మోసమును శంకింపకుండునా? అట్లు శంకింప చేని యది స్తుత్యదర్హమా ! అట్లేల యనవలయును ! ప్రమాదోధమ తామపి ' కదా ! విశ్వసించినను విశ్వసింప కున్నను బుద్ధిసాగరుఁడు బండి నెక్కెను. అది కదలెను. కుమార సింహుఁడును బండివాఁడునుగూడ నెక్కిరి. మంత్రి యతనితో నేదో ప్రసంగము చేయుచుండెను. అస్పష్టముగా, ఆ బండికి వెనుక అప్పుడప్పుడు చిన్న చప్పు డగుచుండెను. ఈ ధ్వని విన్నప్పుడు మనకు నిన్నయాదిల్శాహా రహస్య మందిరమున చెట్టుకడ విన్న చప్పుడు స్ఫరింపకుండునా? ఆ బండి తుంగభద్రాస్రవంతి నానుకొనియున్న యడవులలోనికిఁ బోవుచుండెను.