ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

విజయనగర సామ్రాజ్యము


“ నా జాగు లేదు”

“ నా వెంట దయచేయుడి ? "

కుమార సింహుఁడు ముందు నడిచెను. బుద్ధిసాగరుఁ డతని వెంట నడువ నారంభిం చెను.అతని హృదయము సం తోష సంపూర్ణమాయెను. తానంతటి మహామంత్రిని మోస పుచ్చగల్గితినిగదా యని యతఁడు తన్ను దానే యభినందించు కొనఁజొచ్చెను. అంతకంటె నతని కిందువలనఁ గల్గు లాభమును దలంచుకొన్నప్పుడు వచ్చు హర్షమునకు మేర లేకుండెను. అతఁడు మెల్లగాఁ దనలోఁ దానిట్లు తలపోసికొనెను.

“ బుద్ధిసాగరునంత మహామంత్రిని మోసపుచ్చఁగల్గితిని. ఇఁక రేపు నాయిల్లు బంగారముతో నిండును. చక్రధరుఁడుగారు నా తెలివికి నన్ను అభినందించును. ఆహా! నాజన్మ మెంత యదృష్టవంతము ? "

ఆ యిద్దఱును వాకిట నిలిచియున్న బండిదగ్ఱకుఁ బోయిరి.

'అయ్యా బండి నెక్కుడు ' అనియెను.

అతఁడు బండిని నధిష్ఠించెను. మహాపురుషులకు దీర్ఘ దర్శత్వము స్వాభావికము. సామాన్యుల కగోచరములగు నంశములను వారు చమత్కారముగా గ్రహింతురు. అట్టివారి బుద్ధి అత్యంత సూక్ష్మము. .