ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

విజయనగర సామ్రాజ్యము


. .

ఆ యుత్తరము నతఁడు సొంతముగాఁ జదివెను. అతఁడు తలయూఁచెను!

మహామహుల క్రియ లర్ధ సమన్వితములు. భాషలు మితములు. వా రేది చేసినను, ఏది మాట్లాడినను,అందు పూచిక పుల్లంత యైనను వ్యర్దముండదు. అది యెల్ల నర్ధ సమన్విత మైయే యుండును. వారిభానము లనన్యగోచరములు. అతి దీర్ఘ లోచన సమన్వితములు. అతఁడట్లేల తలయూఁచియుండెనో మన కేమి తెలియును . అతఁడిట్ల నెను

“ కుమార సింహుఁడవు నీవేనా?” చిత్తము. నేనే • బండి యెక్కడ ? "

ద్వారము కడ నున్నది”

విజయసింహునకు నీవే మగుదువు ! "

‘ అతఁడును మేమును జ్ఞాతులము. వరుసకు, అతఁడు నాకన్న యగును.మాకిరువురకును జిన్నప్పటినుండి స్నేహము.”

" అతఁడింక నేమేని నీకు జెప్పినాఁడా ? ”

ఆఁ ! తాను గొంద ఱనుచరులతోఁగూడి పోయి తుంగభద్రాన దీతీరమున నున్న యా పెద్దమఱి చెట్టుదగ్గఱ తమ కొఱకు కని పెట్టుకొని యుందునని చెప్పినాడు ”

ఈ ప్రశ్నములన్నియు నతఁడతని నేల యడుగవల యును ! ఇదియంతయు వ్యర్థ ప్రసంగము కాదా ! అతఁడట్లు . " -