ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

విజయనగర సామ్రాజ్యము


. నొక బంగారు నాణెముంచెను.

అందుకు సం దేహమా? ' ఆనెను.

ఆ నూత్న పురుషుఁడా ద్వారముం బ్రవేశించెను. అతని కెవరు నడ్డము చెప్పలేదు. బుద్ధిసాగరుఁడున్న ప్రక్కభవనమున కతఁడు పోవుచుండెను.

ఆ భవనమున బై యంతస్తు నందుఁ బఱుపుపై నతఁడు పరుండియుండెను. అతనికి నిద్దురపట్టలేదు. అతని మనస్సు యోజనమగ్నమై యుండెను. అచ్చట దీపము ప్రకాశించు చుండెను. ఆ దీపపు వెలుతురున, ఆ దివ్యమూర్తిని మనము కన్నులార దర్శింపవచ్చును. అట్టి కష్ట పరంపరలలోనున్నను, అతఁడు ధైర్యమును విడువలేదు. ఆనూతన పురుషుఁ డతని సమిపించెను. అతఁడత నిగాంచి యిట్లనెను.

• నీవెవరవు?'

“ నన్ను తమమిత్రులగు విజయసింహుఁ డంపినాఁడు ”

ఇంతయర్థ రాత్రమున నేల యతఁడు నీన్నంపి నాఁడు?

మిమ్ములను గొంపోవుటకై " నన్నెట్లు గొంపోవఁ గలవు ! రక్షకులు లేరా ”

“ఇపు డెవరును లేరు ”

రాజద్రోహిని జెఱసాలలో నుంచినప్పుడు రక్షకు లుండ రా?" .