ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

విజయనగర సామ్రాజ్యము


. “ఆఁ ! మాటలాడుము. ఫరవాలేదు'

  • మంత్రిని జెఱసాలలోఁ బ్రొద్దున మీరు చూచితిరి

గదా?

“ఆఁ!'

“ ఇప్పు డతనిని వదలిన '

  • నీకుఁ బెద్ద లాభమువచ్చును ”

“ నాకు లాభ మక్కఱ లేదు. ఆయనకు నావలనం గష్ట మేదియు రాదుగదా!”

“ ఏమియు రాదు."

" అది వెల్లడి కాదా? "

“ కాదు. అగునట్టిస్వభావ మే యిందు లేదు ”

“ పాపము ! మంత్రికిఁగూడ గష్టములు రావుగదా !” అని మరలన నెను. సన్యాసిన వ్వెను. అతఁ డతని చెవిలో నేమో రహస్యముగాఁ జెప్పెను.

'మీరు చెప్పినది మిక్కిలి చిత్రముగానున్నది ”

'అవును. ఇంకను ముందు గలదు ”

"నిశ్చయముగా నీది యొక కథ. ఇపుడు నాకు సంశయ నివర్తి యైనది"

“ ఇఁక సత్వర మే నీవు పోయి యందులకిష్టపడి వారిని బంపుము "

“ చిత్తము "


.