ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

విజయనగర సామ్రాజ్యము


వారికిలోఁబడి యుండవలసి వచ్చినను అతనిని వారు గౌరవింపక మానినవారు కారు. అందుచే నతనిభవిష్య త్తెట్లుండునో, అతని యీకష్టము లెప్పుడు పోవునని యతఁడు చెప్పునో యని వారెల్లరు నతనివంక నేకదృష్టితో వీక్షింపసాగిరి.


"నీ వీరాజ్యమునకుఁ జాల కాలము మంత్రివై యుంటితి. అంతవఱకు నీవు రాజును విశ్వాసముతోడఁ గొల్చితివి. కాని యిపుడు రాజద్రోహి వయితివి. ఇంతలో నీకీ శిక్షపోదు. 'కాని అది ఆయువుండినచో నీయాయువు స్వల్పకాలమే ! పాపము' అతఁడంత నూరకుండెను. మంత్రి ముఖమున విచారము తోఁచుట లేదు.

ఆకారాగృహాధిపతి అతని జెవిలో నేమో యడిగెను.

సన్యాసి మెల్లగా బుద్ధిసాగరుఁడు తప్ప తక్కినవారు వినునట్లు వారము రోజులలో గండము ' అనియెను, ' అతఁడు మరల బుద్ధిసాగరుని వంక దృష్టి సారించెను. అతఁడును చూచెను.

“ పాపము నీయందు నాకుఁ గరుణ జనించుచున్నది. నీపాపములు నశించును. దీనిని జేతికి గట్టుకొనుము." యొక రక్ష రే కతనికిఁగూడఁ గట్టెను. ' నాకిట్టి వానియందు విశ్వాసము లేదు. అదివట్టి బూటకము ' అని యతఁడు విప్పుట నటిం చెమ. అచటి వారెల్లరుఁ జింతించిరి. "