ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారవ ప్రకరణము


జ్యోతిషము

బుద్ధిసాగరుఁ డట్లు కారాగారమునఁ బెట్టఁబడెనుగదా ? పాప మతఁడిపుడేమి చేయుచున్నాఁడో, ఒక సారి చూచి వత్తము. అతని కాపట్టణమున నొక గొప్ప భవనమిచ్చిరి. దాని చుట్టును జక్కని యుపవనముండెను. అతని కందు సకల సౌకర్యములు నమర్చిరి. అతనికి గొదువ లేశమును లేదు. పూర్వమునుండియు భరతఖండమునఁగల రాజ్యములను బాలిం చిన రాజులలో నెక్కడో క్రూరు లొక రిరువురు తక్క తక్కిన వారెల్ల 'రాజఖయిదీల నిట్లే యాదరించిరి.

ఖయిదీ యనఁబడుటతక్క నతనికి సంభవించిన కష్ట మేమియు లేదు. ప్రాకృతజనులు కష్టములకు సహింప లేక దుఃఖంతురు. అతఁ డట్లు చింతింప లేదు. అతని ముఖము ధైర్య వంతముగా నుండెను.

ఒకరికి ద్రోహముచేసి పాపకృత్యములచే లోకమునకు హాని చేసిన వారిని శిక్షించుట రాజధర్మము. కాని యేపాప మెఱుఁగక ప్రజలచేఁ బూజింపఁబడువారిని జెజసాలలోనుం చుట ఆత్మనాశమును జేసికొనుటయే. “ వినాశకాలే విపరీత