ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

విజయనగర సామ్రాజ్యము


ధాన్యములను, కరులను, పట్టణములను, రాజ్యములను గూడఁ దృణములట్లు తలపోయుదురు. దానిని గాపాడుట రాజధర్మము. కావున నిట్టియున్నత వంశస్థుఁడగు నిట్టి జమీందారు నిట్టియాపద సంభవించినప్పుడుసు, అట్టి సుగుణైక భూషితురాలగు పతివ్రతా శిరోమణికి మానహాని సంభవించు చున్నప్పుడును, రాజభక్తి పరాయణుఁడై శౌర్యనిధియైన విజు యసింహున కిట్టి యాపదనచ్చు చున్నప్పుడును దానిని మనము సామోపాయమున నారింపఁ జూడకుండట ధర్మము కాదు. అందుచేఁ బ్రస్తుతము మైత్రితో మెలఁగుచున్న గో ల్కొండ నవాబుగారితో మనము కొంచెము జోక్యముకలుగఁ జేసికొని, జగన్మోహినిని విడిచి పెట్టుఁడని కోరవలసి యున్నది. ఇందులకు సరసులగు కుతుబ్నాహా గారు సంగీకరింతురు గాక" తజువాత మఱికొందఱు లేచి దానిని బలపఱచిరి. ఎల్ల వారు నేక గ్రీవముగా నంగీకరించిరి. కొందఱు యౌవను లుత్సాహ పూరితులై యధిక ప్రసంగముచేయఁ బూనిరి. కాని చక్రవర్తిగారు పడుచుఁదనపు దుడుకుదనము వలన లాభముగఁజాలదని చెప్పి మర్యాదపూర్వకముగ వారిని వారించిరి. కాని వీరవరు లెల్లరు శౌర్యర సముట్టిపడఁ బండ్లు కొఱకఁ జొచ్చిరి. అంత మంత్రియగు చక్రధరుఁడు లేచి శ్రీ చక్రవర్తిగారు గోల్కొండ నవాబునకు వ్రాసిన లేఖ నిట్లు చదివి వినిపించెను.