ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

విజయనగర సామ్రాజ్యము


ధైర్యాదుల చేతను, విక్రమము చేతను, మెప్పించి ప్రధాన సైన్యాధిపతులలో నొకఁడాయె. అతని యెడ రామరాజు నకుఁ బుక్రవాత్సల్యము కలదు. అందుచే నతఁడు దినదినము నూత నాభివృద్ధిని గాంచుచుండెను. గోల్కొండ నవాబు జగన్మో హినిని దలిదండ్రులను దీసికొనిపోయి కారాగారమున బంధిం చిన వార్త విజయనగరము నకు వచ్చెను. ఆపట్టణమున నెల్ల వారును గ్రోధావేశ పరవశులై రి.ఇఁకఁ గేవల శౌర్యప్రధా నులును, బౌరుషవంతులునగు విజయసింహుని వారి కెల్ల రకు నెట్లుండునో మేము వర్ణించుటకంటె మీ రూహించుకొనుట యందముగా నుండును. రామరాజు క్రోధమునకు మితి లేదు. వారి నెల్లరను వెంటనే విడిచి పెట్టవ లయునని గోల్కొండ నవా బునకుఁ దెలియఁ జేయుటకై మఱునాఁడొక సభచేయ నిశ్చ యింపఁబడెను.

సభాస్థల మెల్లను గ్రిక్కిరిసి పోయెను. రాజులు, సామం తులు, బంధువులు జమీందారులు,పండితులు,కవులు, వందులు, మాగధులు, అందఱు చను దెంచిరి. రామరాజు మెల్లగా లేచి యిట్లనియెను.

“ఆర్యులారా !

మన మీనాఁడు సభ చేయుట తటస్థించునని యనుకొన లేదు. కాని యట్టిప్రమేయము తలఁచని తలఁపుగాఁ గల్గినది. విజయసింహుఁడు రాజభ క్తికల్గిన యోధశిఖామణి. దేశాభి