ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూఁడవ ప్రకరణము -

99


తారా.. అది ' లెస్సగా యోచింప వలసినదే.

చక్ర:- ఈమధ్య నెక్కడను గూడదు. విజయనగర మహా పట్టణమున జను లెక్కడనో యేమూలనో యుండియే యుం దురు. అట్టి యెడల నది మిక్కిలి హానిగా నుండును. కావున నిర్జనస్థలమే యిందుకు మిక్కిలి. తగినది. ఇచటి కాఱేడు మైళ్ళ దూరములోనున్న తుంగభద్రానదీ ప్రాంతమందలి యటవీ స్థానమిందుకు గడు ననుకూలముగా నుండును.

ఆదిల్: మీయూహ చాలా బాగుగానున్నది. అది బ్రహ్మ కైనను దుర్భేద్యము.

తారా:- అయినచో, ఆస్థలమునకు గుర్తు చెప్పి యచట విజయ సింహుఁడు బుద్ధిసాగరుని యాగమనము కొఱకు వేచి యున్నాఁడని వ్రాయుఁడు.

చక్ర.. ఆ ప్రదేశమున నొక గొప్ప వట నృక్షము కలదు. ఆ వట వృక్ష ప్రాంతమున నని వ్రా సెదను.

ఆదిల్: అదిమిక్కిలి బాగున్నది. అది భయంకరముగా నుండును. ఆ తావు దీనికి చాల తగినది.

తారా:- ఇంతకు నతఁడు లోఁబడునా ? చక్ర:- లోబడ కేమి చేయును . తనను తప్పించు కొనుటకు నిష్టపడఁడా యేమి ?

ఆదిల్ :- దీనికిఁదప్పక . యతఁడు లోఁబడి తీరును. 'ఇం దతనికి సందియము తగులుటకే కారణము కన్పడదు. కావున నిది