ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూఁడవ ప్రకరణము

97



అంతట, ఆదిల్ షాహా అబుడ్డిని తీసికొనెను. అది త్రావి • హా! ఇప్పుడెంత సౌఖ్యముగా నున్నది. మీకవులెవ రును ద్రాక్షారసమును వర్ణింప లేదా ! అవును. హిందువులకు దానిరుచి యేమి . తెలియును? అమృతము భూలోకమున నున్నచో, అది ద్రాక్షారసమే. ఇంకను, ఎంతైనను ద్రావ వచ్చునుగాని, త్రావినచో, అది మముఁదబ్బిబ్బు చేయును.”

చక్ర:-ప్రస్తుతము కర్తవ్య మేమి ?

ఆదిల్ :-ఏమున్నది ? బుద్ధిసాగరుఁ డున్నంతకాలము మనకు హాయిగా నిద్రపట్టదు. అతనియందు జనుల కెల్లరకు నెం తయో ప్రీతి. అతఁ డేమి చెప్పినను దానిని విశ్వసించు వారును, అనుసరించు వారును బెక్కురుగలరు. ఇప్పుడతఁడు చెఱసాలలో నున్నను, మఱైచ్చటనున్నను అతనిశక్తి చేఁ దప్పించుకొని మనలను సాధింపఁ గలఁడు. వాయువున కగ్నితోడైనట్లు విజయసింహుని పరాక్రమము కూడ నతనికిఁ దోడగును. ఆ రెండును దోడయిన మన మేమియుఁ జేయఁ జాలము. కావునఁ దొందర పడ వలయును.

తారా:-ఆతనిం గడముట్టించుటే మంచి సాధనము. అంత వఱకును మన ప్రయత్నములు నెఱువేఱు చున్నట్లు మనము తలఁపఁగూడదు.

ఆదిల్ : అంధుల కుపాయ మేమి? ఆదీర్గ దర్శిమనకుఁ జిక్కు నా? ఇట్టి తంత్రముల నతఁడు మనకంటె నేడాకు లెక్కుడుగాఁ