ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

విజయనగర సామ్రాజ్యము


అని చదువుచుండెను. అంతలో నా సౌధము నానుకొని యున్న యొక చెట్టుప్రక్కగాఁ గొంచెము చిన్న పాటి సందడి యొకటి విసఁబడెను. అతఁడా యుత్త రమును జేబులో వయిచు కొని 'మెల్లగా నావయిపునకువచ్చియటునిటు చూచెను. కాని యేమియుఁ గన్పడినది కాదు. మరల నాసం దడి విన్నడ లేదు. అతఁడు మరికొంచెము సేపు చూచెను. కాని యేమియు లేదు. అతఁడు పక్షుల సందిడియై యుండు ననుకొనెను. అతఁడు మరల యధాస్థానమునకు వచ్చెను.

ఇంతలో దూరమున నాదిల్శాహాయుఁ జక్రధరుఁడ ను వచ్చుచున్నట్లు తోచెను.అతఁడా కుర్చీపై నఁ గూర్చుండెను. .

ఆయిరువురును వచ్చిరి. వారితో నొక సేనకుఁడు గూడ నుండెను. అతని చేతిలో నాల్గుబుడ్ల నిండుగా మనోహరమగు ద్రాక్షారస ముండెను. అది మిక్కిలి విలువైనది. ప్రశస్తమైనది. తారానాధుఁడు లేచి నిలుచుండెను. వారిరువురుఁగూడ నతని సమీపమునఁగల కుర్చీలకడకు వచ్చిరి. ఆ మువ్వురును గలిసి యదాస్తానముల పైన . గూర్చుండిరి.

తారానాథున కిచ్చి ఆదిల్శాహా యొక బుడ్డినిదీసి " అయ్యా ! త్రాగుఁడు ' అనియెను. విస్మితము చేయుచు నతఁడు “ మేము సుప్రసిద్ధ బ్రాహ్మణులము. ద్రాక్షారసము ద్రావ వచ్చునా ? ' అనియెను.