ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

విజయనగర సామ్రాజ్యము


జగన్మో: తండ్రీ ! నీకన్న కూతుంబలెగాంచి నన్ను విడిచి పెట్టు ము. నీకూతునే, యిబ్లెవఁడేని బాధించిన నీ కెట్లుండునో తలంచుకొనుము. నన్ను వదలిన నీకీహపరలోక సౌఖ్య ములు కల్గును.

నవాబు: ఇంక నీ యుపన్యాసమును గట్టి పెట్టుము. దయ తలఁచినకొలఁది నాలస్యము చేయుచున్నావు. బలవంత మునఁ జేపట్టుట మంచిది కాదని యూరకుంటిని. అట్లు చేసిన నిన్ను రక్షించు వా రెవరో ?

ఆపే తత్తరపడియెను. మూర్చిల్లెను. ఆపెకు స్వర్ల కుమారి సేద దీర్చుచు నిట్లనెను.

“ సోదరా! మమ్ము నిట్లు నిర్బంధించిన నీకుఁ బ్రయోజన మేమి ? ప్రాణముల పై నాస లేని మమ్ముమీరెఱిఁగియే యుందురు. ఆంధ్ర సుందరీమణులు ప్రాణములను మానముకంటె నెక్కువగాఁ దలపోయువారు కొరుసుమీ! కాని దానిమాట యట్లుంచుము. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి నెఱుఁగు దురా?

“ ఒక్కయాంధ్ర సుందరీమణులు మాత్రమే కాదు. హిందూ దేశమున జన్మించిన వారెల్ల ను నట్టివారే. అందుకే నేను భయంపడుచున్నాను ' అని యతఁడు మెల్లగా ననుకొని పై కిమాత్ర మిట్ల నెను “ అవును. విజయనగర చక్రవర్తి నెఱుఁ గుదును. ఎఱిఁగిన నేమి? అతఁడేమి చేయును ? "