ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

విజయనగర సామ్రాజ్యము


శ్లో" యధా ప్రసిద్దె ర్మధురం శిరోరు హై
ర్జటాభిరమ్యేవ మభూతదాననం
నిషట్పద శ్రేణి భి రేవ పంకజం
సశైవ లా సంగమపి ప్రకాశ తే.

అనునట్లు మిక్కిలి రమణీయముగ నే యుండెను. నవాబు లోనఁబ్రవేశింపఁగ నే యొక పరిచారిక నచ్చి యొక కుర్చీని సమీపమున నుంచిపోయెను. అతఁడు దాన నధి ష్టించెను.

'జగన్మోహినీ! నావిషయ మేమాలోచించితివి ! నిజ ముగా నీవు నాయందు దయార్ద్ర దృష్టి నింకఁ గొంత కాలము దాఁకఁ బ్రసరింపఁ జేయవేని నేనింక నీలోకము నందాశ వదలు కొనవలసిదే. సుందరీ ! ఏల యిట్లు నన్ను హింసించెదవు ! ఇంక నన్నెన్ని నాళ్లట్లు బాధ పెట్టెదవు ! చూడుము ! నాయొడలు, ఎట్లు కృశించినదో ? నీకెంత మాత్రమును గరుణ లేదా ! ఇంత కఠినహృదయమును దేవుఁడు నీ కేల కల్పించెనో !_' అనెను. నిట్టూర్పు పుచ్చెను. స్థాణుభువము వహించెను. మఱి మాటలాడ లేకపోయెను.

ఆమె యీమాటల నాలించెనా ! ఆమె మొగమీతని ప్రక్కకుఁ జూచుట లేదు. అతఁడు మాటలాడ నారంభింపఁ గనే యాపెకు శిరఃకంప ముదయించెను. ఆపెతనువు వర్ష