ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

విజయనగర సామ్రాజ్యము


ఆమె భావము మోహాంధకారమునఁబడి ప్రపంచము నే మఱచిన నవాబున కిప్పుడు గోచరమాయెను. రహస్యమా మెకు గోచరించి నందుల కాశ్చర్యపడియెమ. గుండెలు ఝల్లుమ నెను. కొంత సేపు వఱకు నోట మాటరాలేదు. అతఁడు సమీపించి యామెచేయి పట్టుకొని “ నన్ను రక్షింపుము ' అనెను.

ఆమె తొలఁగి దూరముగా నిలువఁబడెను. కాని యతఁడు సమీపించి నన్ను రక్షింపుము " అని మరల వచింపుచు పాదముల మీఁదఁ బడెను. ఆమె యా ప్రదేశము విడచి చనెను.

కోపము మిక్కిలి చెడ్డది. యుక్తాయుక్తములను దెలియ నీయదు. కామ మంతకంటే గొప్పది.మఱి నాలుగాకు లెక్కువ చదివినది. ఆ పె కోపనతి. ఈతఁడు కాముకుఁడు. ఈ రాణి మొగము చూడను. ఆ క్రొత్త సుందరినే పోయి చూచెదను అని యతఁడను కొని తన దారిఁబట్టెను. 4 " .